మధురవాడలో మద్యం లారీ బోల్తా..

Liquor lorry overturned

Advertisements

&NewLine;<p>విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది&period; ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది&period; ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది&period; ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి&period; ఇది గమనించిన స్థానికులు&comma; పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు&period; ఎవరికి నచ్చినట్లు వారు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు&period; ఘటన జరిగిన సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే స్పందించారు&period; జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు&period; వెంటనే మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు&period; ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..