తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఈ ప్రపంచానికి మెుత్తం తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉద్యమాలు జరిగాయంటే అది ఆయన గొప్పతనం అని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, దేశంలో ఉన్న అనేక నేతలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబు కుటుంబం, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువుగా ప్రజల్ని ప్రేమించారు. ఆయనకి అండగా నిలబడటమే కాకుండా ఆయన చేసిన గొప్ప పనులు ఇప్పటి యువతకు తెలిసేలా చేసారు. ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నిజాన్ని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, 43 వేల కోట్ల ప్రజాధనం దోచేసిన వాళ్లను ఎం చెయ్యాలి. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా డాన్‌గా జగన్ మారారన్నారు. మూడు నెలల్లో జగన్ పర్మినెంట్‌గా జైలుకి పోవడం ఖాయం. ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు, మంత్రులు ఎక్కడికి పోతారు రేపు అవినీతి కి పాల్పడిన టోటల్ వైసీపీ ఇన్ జైల్. జైలర్ ఎవరో తెలుసా… చంద్రబాబు. మీ తాట తీస్తారు. ఇది ఖాయం రాసిపెట్టుకోండి. చలి కాలంలో ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. మూడు నెలల్లో ఫ్యాన్ మాడిపోవడం ఖాయం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రజలని ప్రేమించారు- లోకేష్
86
previous post