తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపించాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఫుజియాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. డ్రాగన్‌ను తమ సన్నిహిత మిత్రదేశాల్లో, అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ, లక్షద్వీప్ పరిసరాలపై.. మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా అధినేత జిన్‌పింగ్ ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను ముయిజ్జు మరోసారి ప్రశంసించారు. తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించిందని చెప్పారు. మాల్దీవులకు చైనా పర్యాటకుల సంఖ్య పెంచాలని కోరారు. ‘‘కొవిడ్‌కు ముందు మాకు చైనా నంబర్ వన్ మార్కెట్. ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’’ అని అభ్యర్థించారు. మాల్దీవుల్లో సమీకృత పర్యాటక జోన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు 50 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయని స్థానిక మీడియా తెలిపింది.
చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు విజ్ఞప్తి
124
previous post