సింగర్ మంగ్లీ వివాదంలో రోజుకో ట్విస్ట్..

Advertisements

<p>తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా&comma; లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు&period; ఈ మేరకు ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది&period; లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికంటే ముందే&comma; తానే నార్సింగి పోలీసులను ఆశ్రయించానని మంగ్లీ స్పష్టం చేశారు&period; సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు&period; ఆ డబ్బు తనది కాదు&comma; ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు&period;లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని&comma; తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు&period; వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు&period; నిరాధారమైన ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మంగ్లీ హెచ్చరించారు&period; ఒక మహిళగా&comma; కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆమె వెల్లడించారు<&sol;p>&NewLine;<p>కాగా&comma; మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే&period; మైక్రో ఫైనాన్స్‌ పేరిట 10కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు మంగ్లీ&comma; ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు&period; తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు&period; దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351&lpar;2&rpar;&comma; 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు&period; మైక్రో ఫైనాన్స్ పేరిట రూ&period;10 కోట్లు పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి&period; ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు à°¶à°¿à°µ&comma; &OpenCurlyQuote;విరాటపర్వం’ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేర్లు కూడా చేరడం గమనార్హం&period;<br &sol;>&NewLine;దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి కోట్లు రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ&period; వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది&period; అయితే&comma; ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా&comma; కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు&period; కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా&comma; మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి&period;<br &sol;>&NewLine;అయితే&comma; మంగ్లీ&comma; ఆమె సోదరుడు à°¶à°¿à°µ&comma; దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని&comma; తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 &lpar;2&rpar;&comma; 352 కింద కేసు నమోదు చేశారు&period; మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది&period; ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు&period; అక్రమంగా నిధులు వసూలు చేశారా&period;&period;లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా&quest; అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…