ధరణి పోర్టల్‌ అమలులో అనేక లోపాలు…

A committee appointed by the government to study the Dharani portal system

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ధరణి పోర్టల్‌ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది&period; కలెక్టర్లతో సమావేశమైన కమిటీ&period;&period; పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది&period; 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది&period; 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా&period;&period; 23 లక్షల ఎకరాలు పార్ట్‌-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది&period; కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… ఈనెల 27à°¨ గిరిజన&comma; అటవీ&comma; వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది&period; భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ పరిధిలోకి తీసుకొచ్చింది&period; సంకల్పం గొప్పదైనా&period;&period; ఆచరణలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి&period; ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని&period;&period; దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది&period; ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్‌ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీని వేసింది&period; నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్‌ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది&period; సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది&period; కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది&period; తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని&period;&period;చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది&period; ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"XuQNdgYzzLM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.