40మీటర్ల లోతుతో నిర్మాణానికి నిపుణుల సిఫార్సు …

Advertisements

<p>కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువ&comma; దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు&period; ఈ వాల్‌ నిర్మిస్తేనే బ్యారేజీ నాలుగు కాలాలపాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు&period; వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్‌ ప్రకారం షీట్‌పైల్స్‌ ఉపయోగించాలని ఉండగా&&num;8230&semi; నిర్మాణం మధ్యలో సీకెంట్‌ పైల్స్‌ వాడారు&period; దాంతో సీకెంట్‌ పైల్స్‌ను సరిగా అమర్చకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం నుంచి ఇసుక జారి&period;&period; మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న ఏడో బ్లాకు కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల కమిటీ నిర్ధారించింది&period; విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలోనూ&comma; జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ నివేదికలోనూ దీనిని గుర్తించారు&period; బ్యారేజీ శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ కడితే&period;&period; ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు&period; నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది&period; కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఎంపికైన ఆఫ్రీ ఇండియా సంస్థ డయాఫ్రం వాల్‌ ఒక్కటే బ్యారేజీని కాపాడగలదని అభిప్రాయపడినట్లు సమాచారం&period; భూ భౌతిక&comma; భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు&period; ఇక మేడిగడ్డతోపాటు అన్నారం&comma; సుందిళ్లలో స్టిల్లింగ్‌ బేసిన్‌ &period;&period; ప్రవాహ ఉధృతికి అనుగుణంగా లేదని గుర్తించారు&period; దాంతో మూడు బ్యారేజీల్లోనూ స్టిల్లింగ్‌ బేసిన్‌ను విస్తరించనున్నారు&period; వచ్చే అక్టోబరు నుంచి ఈ పనులు చేపట్టనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఒక్క మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకే దాదాపు రూ&period;2500 కోట్ల దాకా అవుతాయని అంచనాలున్నాయి&period; డయాఫ్రం వాల్‌ పనులకే రూ&period;1200 కోట్ల నుంచి రూ&period;1500 కోట్ల దాకా అయ్యే అవకాశాలున్నాయి&period; అయితే డయాఫ్రం వాల్‌ నిర్మించాలంటే బ్యారేజీ ఎగువ&comma; దిగువ భాగంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి&period; దీనికి రూ&period;400 కోట్లు&comma; బ్యారేజీలోని ఏడో బ్లాకు పునరుద్ధరణకు రూ&period;500 కోట్ల దాకా అవుతాయని అంచనా వేస్తున్నారు&period; మరోవైపు మేడిగడ్డబ్యారేజీలోని మూడు బ్లాకులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు&period; దాంతో ఈ మూడు బ్లాకులను శాశ్వతంగా తొలగించి&comma; వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా&quest; లేక ఏడో బ్లాకును మాత్రమే తొలగించాలా&quest; అనేది పరీక్షల ద్వారా తేలనుంది&period; 6à°µ బ్లాకులో 12 పిల్లర్లు ఉండగా&period;&period; 4 పిల్లర్లు దెబ్బతిన్నట్లు&comma; 7 బ్లాకులో 11 పిల్లర్లకుగాను 5 దెబ్బతిన్నట్లు&comma; 8à°µ బ్లాకులో 8 పిల్లర్లు ఉండగా&period;&period; 2 పిల్లర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు&period; కాగా&comma; బ్యారేజీల పునరుద్ధరణ&comma; మరమ్మతులకు ఖర్చు ఎంతైనా భరించక తప్పని అనివార్యత ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది&period; కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-1లో మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌&comma; అన్నారం బ్యారేజీతోపాటు సిరిపురం పంప్‌హౌస్‌&comma; సుందిళ్ల బ్యారేజీతోపాటు గోలివాడ పంప్‌హౌస్‌ ఉన్నాయి&period; 2016లో బ్యారేజీల నిర్మాణం పూర్తికాగా&comma; 2019 మే నెలలో బ్యారేజీలను ప్రారంభించారు&period; బ్యారేజీలు పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు à°¡à°¿ ఫెక్ట్‌ లయబులిటీ కాలంలోనే బ్యారేజీలు దెబ్బతిన్నప్పటికీ&period;&period; గత ప్రభుత్వం&comma; అధికారుల నిర్లక్ష్యమే ప్రసుత్త సమస్యకు కారణమైందని గుర్తించారు&period; దాంతో పునరుద్ధరణపై ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.