సీఎం రేవంత్ తో ముగిసిన మీనాక్షి, మహేశ్ కుమార్ భేటీ..

Advertisements

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్&comma; టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు&period; భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ&comma; నియోజకవర్గాల పునర్విభజన పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం&period; దేశవ్యాప్తంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఎలాంటి నష్టం కలిగే అవకాశం ఉందనే అంశంపై ప్రధానంగా చర్చించారు&period; జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీనాక్షి నటనరాజన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు&period; దీనికి సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ&period;&period; దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన పోరాటాలు&comma; ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం&period; అలాగే&period;&period; దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు సీఎం ప్రతిపాదించిన &OpenCurlyQuote;హైబ్రిడ్ మోడల్’ పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది&period; చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు&period; పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని మీనాక్షి నటరాజన్ కోరారు&period; ఇప్పటికే పదవుల్లో ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్ల పనితీరును బేరీజు వేసి వారి పదవీకాలం పొడిగింపు లేదా కొత్త వారి నియామకంపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..