73
జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. జూనియర్ డాక్టర్లకు హాస్టల్ సదుపాయం సరిపోవడం లేదన్నారు డాక్టర్ కార్తీక్, డాక్టర్ పవన్ కళ్యాణ్. సదుపాయాలు సరిగా లేకపోవడంతోనే సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో వచ్చే నెల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల్లో, హస్టల్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్టైఫండ్స్ కూడా అందేలా చూస్తామన్నారు.
ప్రతీ నెలా పదిహేను లోపు ఉపకార వేతనాలు వచ్చేలా చూస్తామన్నారు.