పారదర్శకత కోసం మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..

Advertisements

<p>రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రుసుము వసూళ్లను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు&period; గత రెండు సంవత్సరాల్లో మార్కెటింగ్ యార్డులలో 568 కోట్లతో 630 అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు&period; వీటిలో 128 కోట్ల విలువైన 113 పనులు పూర్తయ్యాయని వెల్లడించారు&period; సచివాలయంలో మార్కెటింగ్&comma; మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు&period; ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తోందని&comma; దీనిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు&period; అక్రమాలకు పాల్పడే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేయడానికి వెనుకాడవద్దని&comma; దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని&comma; వాటి పురోగతిని ప్రతిరోజూ సమీక్షించేలా ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు&period; మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలను ప్రాధాన్యత క్రమంలో కల్పించాలని సూచించారు&period; గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలో స్మార్ట్ మార్కెట్ యార్డ్ సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించి&comma; ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అన్ని మార్కెట్ యార్డులను డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్‌ను అరికట్టాలని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>కోహెడ పండ్ల మార్కెట్ పనులకు సంబంధించి సర్వే పూర్తయిందని&comma; త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు&period; ప్రతి పనికి ప్రారంభ తేదీ&comma; గడువు తేదీని నిర్ణయించుకుని నిర్దిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు&period; అలాగే&comma; విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు గ్రిడ్ అనుసంధానంతో కూడిన సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు&period; జూలై చివరికల్లా ఈ పనులు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టారు&period;<&sol;p>&NewLine;<p>ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన తార్పాలిన్లు&comma; తేమ కొలిచే పరికరాలు&comma; క్లీనింగ్ డ్రైయర్లను అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు&period; మొక్కజొన్న పండించిన రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలని సూచించారు&period; డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతితో నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..