సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది&period; ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన&comma; పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది&period; సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు&comma; బీసీ జనార్దన్ రెడ్డి&comma; వంగలపూడి అనిత&comma; సత్య కుమార్ యాదవ్&comma; అనగాని సత్యప్రసాద్ ఉన్నారు&period; సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న &OpenCurlyQuote;డిజిటల్ టు ది కోర్&comma; అండ్ సర్వ్స్ విత్ హార్ట్ అనే నినాదం మంత్రులను విశేషంగా ఆకర్షించింది&period; సింగపూర్ ప్రభుత్వ టెక్నాలజీ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న టాన్ ఎంగ్ ఫెంగ్ మంత్రులకు అక్కడి డిజిటల్ వ్యూహాల గురించి వివరించారు&period;<&sol;p>&NewLine;<p>సింగపూర్ పౌరులు&comma; నివాసితులకు అందించే అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపు కార్డు సింగ్‌పాస్&period; దీని ద్వారా ప్రభుత్వ సేవలను అత్యంత వేగంగా&comma; భద్రంగా ఎలా పొందవచ్చో మంత్రులు తెలుసుకున్నారు&period; పౌరుల సమగ్ర మెడికల్ రికార్డ్స్&comma; వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరిచే యాప్ హెల్త్‌హబ్&period; ఎక్కడ ఉన్నా తమ ఆరోగ్య సమాచారాన్ని చూసుకునే వెసులుబాటు కల్పించే ఈ విధానంపై ఆసక్తి కనపరిచారు&period; నగర పాలనలో డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>సింగపూర్‌లో నేర్చుకున్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది&period; ముఖ్యంగా &&num;8216&semi;స్వర్ణాంధ్ర &&num;8211&semi; 2047&&num;8217&semi; విజన్‌లో భాగంగా రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన&comma; పారదర్శకమైన&comma; వేగవంతమైన డిజిటల్ పౌర సేవలు&comma; ఆరోగ్య రంగంలో సమగ్ర డిజిటల్ డేటా నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు&period; ఏడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులకు సింగపూర్ కోపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేశారు&period; ఈ సందర్భంగా తమకు విలువైన సమాచారాన్ని అందించిన టాన్ ఎంగ్ ఫెంగ్‌ను మంత్రులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..