విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది. బెంజి సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.