Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home National హర్యానాలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

హర్యానాలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

by Rama
BJP

లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా (Haryana) లోని అధికార బీజేపీ (BJP) ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్ సైనీ సారథ్యంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గోలెన్, ధర్మ్‌పాల్ గోండెర్ మద్దతు వెనక్కి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్‌కేనని ప్రకటించి బీజేపీని ఇరకాటంలో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భానుతో కలిసి రోహ్‌తక్‌లో నిర్వహించిన సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారని, వారిలో బీజేపీ సభ్యులు 40 మంది మాత్రమేనని తెలిపారు. ఇటీవలి వరకు మద్దతిచ్చిన జేజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు తాము కూడా మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఇక ఒక్క నిమిషం కూడా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
    ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
  • నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.
    నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
  • నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
    నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: