వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మోడీ…

Vibrant Gujarat Global Summit

Advertisements

&NewLine;<p>ప్రపంచ దేశాలు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు&period; వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు&period; రాబోయే రోజుల్లో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు&period; ప్రస్తుతం భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది&period; పదేళ్ల క్రితం 11à°µ స్థానంలో ఉంది&period; అన్ని పరిశోధనా సంస్థలూ భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నాయి&period; ఇది తప్పకుండా జరుగుతుంది అని హామీ ఇస్తున్నా అని చెప్పారు&period; గ్లోబల్ ఎకానమీలో&comma; పరిష్కారాలను కనుగొనే సాంకేతిక కేంద్రంగా భారత్ ఉందని వెల్లడించారు&period; వచ్చే 25 ఏళ్ల లక్ష్యం దిశగా భారత్ పని చేస్తోందన్నారు&period; 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం మాకు ఉంది&period; కాబట్టి ఈ 25 ఏళ్లు భారత్‌కు ఎంతో ముఖ్యం అని చెప్పారు&period; ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.