57
సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఈ వేడుకల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు, డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు, తీర్పులను ప్రజలకు పీఎం అందుబాటులోకి తేనున్నారు.