‘మన్ కీ బాత్’ ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు

pm modi

Advertisements

&NewLine;<p>భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు&period; పరిపాలన ఎలా ఉండాలనేది&comma; ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే విషయాలకు రామ రాజ్యమే చక్కటి ఉదాహరణ అని అన్నారు&period; ఈమేరకు మన్ కీ బాత్ ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు&period; రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలకు రాజ్యాంగ నిర్మాతలు స్థలం కేటాయించారని గుర్తుచేశారు&period; తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని&comma; మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు&period; అయోధ్యలో ఇటీవల జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండుగలా జరుపుకుందని అన్నారు&period; దేశ విదేశాల్లోనూ రామ నామం మార్మోగిందని&comma; వసుధైక కుటుంబం అనే భావనను ప్రజలు చాటారని వెల్లడించారు&period; బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలందరి మాటల్లో&comma; మదిలో రాముడే ఉన్నాడని మోదీ చెప్పారు&period; దేశమంతా రామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకుందన్నారు&period; అమృత్ కాల్ లో జరుపుకున్న గణతంత్ర వేడుకల్లో మహిళలు తమ శక్తిని చాటారని మెచ్చుకున్నారు&period; పరేడ్ లో పాల్గొన్న 20 కంటింజెంట్స్ లో 11 కంటింజెంట్లు మహిళలేనని&comma; ఎక్కువ భాగం మహిళలే నాయకత్వం వహించారని గుర్తుచేశారు&period; కళాకారులలోనూ పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారని చెప్పారు&period; మన సంప్రదాయ సంగీత వాయిద్యాలు శంఖం&comma; నాదస్వరం వంటి వాటిని కూడా మహిళలే వాయించారని తెలిపారు&period; మన దేశ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని&comma; అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పారు&period; ఈ ఏడాది 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరించినట్లు ప్రధాని వివరించారు&period; పద్మ అవార్డుల గురించి ప్రస్తావిస్తూ పద్మ అవార్డుల ప్రధానం విషయంలో చాలా మార్పులు జరిగాయని&comma; ప్రస్తుతం ఇవి ప్రజల అవార్డులుగా మారాయని తెలిపారు&period; సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వారికి ఈసారి పద్మ అవార్డులు దక్కాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.