డోలి కట్టి ఆసుపత్రికి తరలింపు..

Trible Area

Advertisements

&NewLine;<p>స్వాతంత్రం సిద్ధించి నేటికీ 75 ఏళ్లు అయినప్పటికీ గిరిజన ప్రాంతాలకు విద్య వైద్య సౌకర్యాలు కనుచూపు మీద కనిపించడం లేదు&period; గర్భిణీ స్త్రీలు ప్రసవవేదన సమయంలో దవాఖానాలకు వెళ్ళాలంటే డోలు కట్టి మనుషులు మోసుకుని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితిలో నేటికీ ఉన్నాయంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నామో చెప్పకనే తెలుస్తుంది&period; అటువంటి హృదయ విధానకరమైన సంఘటన కుక్కునూరు మండలం జిన్నెల‌గూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకుంది&period; వివరాలలోకి వెళితే కుక్కునూరు మండలం జిన్నెలగూడెం అనే వలస గిరిజన గ్రామంలో జనవరి 26 శుక్రవారం కూరం కోసి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంది&period; ఆ గ్రామానికి రహదారి సౌకర్యాలు ఏమి లేకపోవడంతో 108 కి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయింది&period; కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా అవకాశం లేదు&period; దీంతో ఆ గ్రామస్తులు డోలి కట్టి ఆ గర్భిణీ మహిళను నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న బర్ల మడుగు గ్రామం వరకు మోసుకుని వెళ్ళాల్సి వచ్చింది&period; అనంతరం అక్కడినుండి వాహనం ద్వారా ప్రయాణించి ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది&period; రెండు దశాబ్దాల క్రితం బతుకుదెరువు కోసం చతిస్గడ్ రాష్ట్రం నుండి గిరిజనులు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కుక్కునూరు మండలంనకు వలస వచ్చారు&period; అప్పటినుండి తమ గిరిజన గ్రామానికి రహదారి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మొత్తుకుంటున్నా తమ గ్రామానికి ఏమి ప్రయోజనం కలగలేదని&comma; దీంతో 75à°µ గణతంత్ర దినోత్సవం నాడు గర్భిణీ మహిళ ప్రసవవేదనతో బాధపడుతున్న దౌర్భాగ్యం పరిస్థితుల మధ్య మా గ్రామం ఉందని వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఈ విషయపై సిపిఐ కుక్కునూరు మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి మాట్లాడుతూ&period;&period; రెండు దశాబ్దాల క్రితం పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వలస వచ్చిన గిరిజనులు కడు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని&comma; వలస గిరిజన గ్రామాల్లో రహదారి విద్యా వైద్య సౌకర్యాలు&comma; ఉపాధి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఉన్నతాధికారులకు పలు సార్లు వినతి పత్రాలు&comma; ధర్నాలు రాస్తారోకోలు&comma; వివిధ రూపాల్లో తమ అవసరాలను గుర్తు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదని ఆయన అన్నారు&period; తమ వినతులను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల గణతంత్ర దినోత్సవం నాడు ప్రసవం కోసం గిరిజన మహిళను డోలు కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు&period; ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వలస గిరిజన గ్రామాలకు విద్యుత్&comma; విద్య&comma; వైద్యం&comma; రహదారి&comma; ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు&period; వలస గిరిజన గ్రామాల్లో అనేకమంది డిగ్రీ&comma; పీజీ చేసిన‌ విద్యార్థులు ఉద్యోగాలు లేక వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు&period; ఛత్తీస్ ఘడ్ గిరిజనులకు ఎస్టి కుల దృవీకరణ పత్రాలు ఇవ్వటానికి ఇక్కడ అధికారులు నిరాకరించడంతో వారికి ఉద్యోగ అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి వలస గిరిజనుల పట్ల సహృదయంతో వ్యవహరించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాల కొరకు ఎస్టి కుల దృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలని వెంకటాచారి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"TSKoMSpFYnk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.