79
గుంటూరు జిల్లా మంగళగిరి ఆలయాల్లో నారా లోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
Read Also..
Read Also..