116
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ రైతుల దినోత్సవంలో భాగంగా మహిళా రైతులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి అన్నం పెట్టే రైతన్నల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రైతుల దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మహిళా రైతులు ఎమ్మెల్యేను కోరారు.