నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167 బి పై రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బుధవారం రాత్రి వలేటివారిపాలెం సమీపంలోని మన్నేరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మార్జిన్ లో కూరుకుపోయింది. గురువారం ఉదయం ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారి వాహనం పడటంతో గాయాలు అయ్యాయి. ఇలా వర్షాలు పడుతున్న సమయంలో వాహన సోదకులు తీవ్ర ఇకట్లు పడుతున్నారు. మాలకొండ నుంచి కూనిపాలెం వరకు రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారిలో మెటల్ ఏర్పాటు చేయని చోట్ల మట్టి పై వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ప్రయాణికులకు ప్రయాణం చేయాలంటే నరకయాతనలు, పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రోడ్డుమీద వెళ్లాలంటే ఏమవుతుందో అని ప్రజలు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలు చేయాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురివుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులలో ఉపయోగించే గ్రావెల్ లో బంక మట్టి ఉండటం వలన రాకపోకలు చేయాలంటే ప్రజలు , వాహాన చోదుకులు బాధలు అన్నీ, ఇన్నీ కావనే ఆరోపణలు వాహన శోధకులు నుంచి వినిపిస్తుంది. ఆటోలు, ద్విచక్ర వాహన చొదఖలు రాకపోకలను చేయాలంటే వాహననాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంకా దారిలోకి రాని రహదారి… వాహనాలకు తప్పని తిప్పలు.
57
previous post