దేశవ్యాప్తంగా 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు…

National Investigation Agency

Advertisements

&NewLine;<p>దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు&period; ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో ఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం&period; ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా&period;&period; మహారాష్ట్ర&comma; ఝార్ఖండ్&comma; ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి&period; ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే&period; ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు&comma; నగదు&comma; పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు&period; ఇందులో ఒకరు ఐసిస్ సానుభూతి పరుడని&comma; యువతను ఐసిస్ లో చేరుస్తున్నాడని గుర్తించారు&period; నిందితుడిని మరింత లోతుగా విచారించి సేకరించిన సమాచారంతో అధికారులు తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.