అన్నాడీఎంకేకు భారీ షాక్.

అన్నాడీఎంకేకు భారీ షాక్

Advertisements

<p>తమిళనాడులో అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీకి చెందిన కీలక నేతలు&comma; మాజీ మంత్రులు డాక్టర్ సి&period; విజయభాస్కర్&comma; ఎం&period;ఆర్&period; విజయభాస్కర్ అధికార టీవీకే పార్టీలో చేరారు&period; వీరితో పాటు సుమారు 15 వేల మంది మద్దతుదారులు కూడా పార్టీ మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది&period; చెన్నై సమీపంలోని మామల్లపురంలో గల ఒక ప్రైవేట్ హోటల్‌లో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది&period; టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్&period; ఆనంద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు&period; మంత్రి ఆధవ్ అర్జున కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు&period; అన్నాడీఎంకే నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితోనే తాము పార్టీ మారుతున్నట్లు మాజీ మంత్రులు స్పష్టం చేశారు&period; ఈ సందర్భంగా సి&period; విజయభాస్కర్ మాట్లాడుతూ&comma; ఎన్నికలకు ముందు మరియు తర్వాత కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తాము పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఎంజీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా డీఎంకేతో పొత్తుకు ప్రయత్నిస్తుండటంతో తాము పార్టీలో ఇమడలేకపోయామని తెలిపారు&period; ప్రజల్లో అపారమైన విశ్వాసం నింపిన విజయ్ నాయకత్వంలోని టీవీకేలో చేరడమే సముచితమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు&period; ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన అతిపెద్ద చేరికల్లో ఇది ఒకటి&period; ఈ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మరో మాజీ మంత్రి ఎస్&period; వలర్మతి&comma; ఎం&period;ఎస్&period;ఎం&period; ఆనందన్&comma; పలువురు మాజీ ఎమ్మెల్యేలు&comma; 208 మంది యూనియన్ కార్యదర్శులు కూడా టీవీకేలో చేరారు&period; కరూర్&comma; పుదుక్కోట్టై జిల్లాల నుంచి సుమారు 200 బస్సులు&comma; 600 కార్లలో భారీ సంఖ్యలో మద్దతుదారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు&period; ఈ చేరికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని&comma; రాబోయే ఎన్నికల్లో టీవీకే వంద శాతం విజయం సాధిస్తుందని విజయభాస్కర్ ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.