కొనసాగుతున్న ఉభయ సభల వాయిదాల పర్వం.

Advertisements

<p>నీట్‌ పేపర్‌ లీకేజి పై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడుకాయి&period; గురువారం ఉదయం సభలు ప్రారంభం అవ్వడమే అలస్యం విపక్షలు సభను అడ్డుకోవడంతో సభలు వాయిదాల పర్వం నాలుగవ రోజు కూడా కొనసాగుతుంది&period; పేపర్‌ లీకేజీలు పై కేంద్రం వివరణ&comma;&&num;8230&semi; కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా&comma;&&num;8230&semi; విద్యార్థులకు క్షేమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు అడ్డకుకోవడంతో వరుసగా నాలుగవ రోజు కూడా సభలు వాయిదా పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>అనేక కీలక అంశాల పై చర్చించేందుకు ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అడుగు కూడా ముందుకు సాగడం లేదు&period; పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ చర్చలకు విపక్షలు ససేమీరా అంటున్నాయి&period; ముఖ్యంగా నీట్‌ పేపర్‌ లీకేజి విషయంలో పార్లమెంట్‌ సమావేశాలు అగ్గి రాజేసింది&period; పేపర్‌ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షలు పట్టుపట్టాయి&period; ఇప్పటికే మూడు రోజుల పాటు ఇదే అంశంలో ఉభయ సభలు వాయిదా పడగా నాలుగవ రోజు కూడా పరిస్థితలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం&period; ఓ వైపు ఎన్డీఏ పక్షాలు మరోవైపు యూపీఏ పక్షాలు కూడా సభలో అందోళనలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకుంది&period; సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీలు అందోళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి&period; చివరకు సభ నిర్వహణలో ఏలాంటి మార్పు రాకపోవడంతో సభాపతులు శుక్రవారంకు సభను వాయిదా వేశారు&period; సభలు వాయిదా పడిన తరువాత కూడా విపక్షలు పార్లమెంట్‌ ఎదుట ప్లేకార్డులతో అందోళను చేపట్టాయి&period;<&sol;p>&NewLine;<p>పేపర్‌ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని లేదంటే కేంద్ర ప్రభుత్వమే అయను బర్తరఫ్‌ చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి&period; అదేవిధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పై లాఠీలు జులిపించినందుకు ప్రభుత్వం వారికి క్షేమాపణ చెప్పాలని సభలు నినాదాలు చేశారు&period; విద్యార్థుల పై బలప్రయోగానికి చేయడమే కాకుండా వారి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు&period; ఈ విషయంలో కేంద్రం పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చిన తరువాతే నీట్‌ పై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి&period;<&sol;p>&NewLine;<p>పశ్నపత్రాల లీక్‌ విషయంలో సభలో చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది&period; అయితే ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని తరువాతే చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి&period; రూల్‌ 267 కింద చర్చ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే చెప్పారు&period; అలాగే రాహుల్‌ గాంధీ&comma; ప్రియాంకగాంధీలను అవమానించారని అయన ఆరోపించారు&period; అయితే దీని పై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌రిజిజు మాట్లాడుతూ నీట్‌ పై చర్చ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాలు అడ్డకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు&period; చర్చలు జరిపేందుకు మేము సిద్దంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా చర్చలకు ముందే షరత్తులు పెట్టడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీట్‌ పేపర్‌ లీకేజీల పై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించడం జరిగింది&period; పేపర్‌ లీకేజీల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయంలో స్పందించారు&period; మునుముందు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల పై వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు&period; దీని వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడే నింధితులకు త్వరతిగతిన శిక్షలు వేసేందుకు వీలుగా చర్యలు చేపడతామని అయన ఎక్స్‌ వేధికగా ప్రకటించారు&period; దేశ యువత భవిష్యత్తు వారి సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పై ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు&period; యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరు అంటూ కౌంటర్‌ ఇచ్చారు&period; దేశ యువత భవిష్యత్తుకు అతి పెద్ద ద్రోహం చేసి&comma; దానిని నాశనం చేసింది మీరే అని ఆరోపించారు&period; విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారిపోయేలా చేశారని&comma; కేవలం కొంతమంది చేతుల్లో బందీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు&period; ఇలాంటి వారికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని విరుచుకుపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.