దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ.

Advertisements

<p>దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరిస్తే&period;&period; కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు&period; తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు&period; నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు&comma; పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు&period; నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ&period;&period;ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు&comma; విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు&period; విద్యార్థుల నిరసనలకు తీవ్ర నిరసన జ్వాలలు తోడవడంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది&period; ఎట్టకేలకు విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో మంత్రి రాజీనామా బాట పట్టక తప్పలేదు&period;<&sol;p>&NewLine;<p>గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు&period; తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని&period;&period; దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా చేసినట్లు ట్వీట్‌ చేశారు&period; యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని&period;&period; మంత్రిగా ఇన్నాళ్లు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలని ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ&period;&period; కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై సీజేపీ స్పందించింది&period; కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన అభిజీత్ దీప్కే&comma; ఆ పార్టీ సభ్యులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై హర్షం వ్యక్తం చేశారు&period; 36 రోజులుగా విద్యార్థులతో కలిసి తాము చేస్తోన్న పోరాటం ఫలించిందని&comma; కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు&period; కాక్రోచ్ లు గెలిచాయని&comma; ప్రజాస్వామ్యానిదే గెలుపయిందని ఆనందించారు&period; ఈ పోరాటంతో తాము ఎవరికీ హీరోలు కావాలని అనుకోలేదని&comma; కేవలం విద్యార్థుల కోసమే పోరాడామన్నారు&period; తమకు రాజకీయాలు అవసరం లేదని&comma; తమ పోరాటానికి దక్కిన గొప్ప విజయం ఇది అని స్పష్టం చేశారు&period; ఇక్కడ ఎవరికి వారే హీరో అని&comma; ఈ పోరాటంలో భాగమైన ప్రతి విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు&period; ఎండనకా&comma; వాననకా ప్రతిరోజూ పోరాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.