సోనమ్‌ వాంగ్‌చుక్‌ కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>ప్రముఖ విద్యావేత్త&comma; సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; నీట్ వ్యవహారం&comma; విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం 26 రోజుల సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేసినా&period;&period; తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ మేరకు ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు&period; కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని తన దీక్షను విరమించారంటూ సాగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వాంగ్‌చుక్‌&period;&period; ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్నారు&period; ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ&comma; దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని&comma; విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం తాను చేపట్టిన ఈ స్ట్రైక్ అత్యంత పవిత్రమైనదని అభివర్ణించారు&period; &&num;8220&semi;నాకు కేంద్రంతో డీల్ చేసుకోవాల్సిన అవసరమే ఉంటే&comma; ఈ తీవ్రమైన ఎండలో&comma; వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఏకంగా 26 రోజుల పాటు ఆకలితో నిరాహార దీక్ష ఎందుకు చేస్తానని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<p>విద్యార్థుల హక్కుల కోసం&comma; న్యాయమైన విద్యా విధానం కోసం తాను చేసిన పోరాటంలో ఎలాంటి స్వార్థం లేదని స్పష్టం చేశారు&period; విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇన్ని రోజులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేసిన తర్వాత కూడా తన నిజాయితీని&comma; నిబద్ధతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు&period; విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శకంగా పోరాడుతున్న వారిపై ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరమన్నారు&period; తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని&comma; విద్యా వ్యవస్థలో మార్పు కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన ఈ వీడియో ద్వారా కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.