యూపీలో గాలివాన బీభత్సం..

యూపీలో గాలివాన బీభత్సం

Advertisements

<p>యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది&period; పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా&comma; 72 మంది గాయపడ్డారు&period; యూపీలో కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి&period; వాతావరణం ఒక్కసారిగా మారిపోయి&comma; భారీ క్యుములోనింబస్‌ మేఘాలు అనేక ప్రాంతాలను కమ్మేశాయి&period; ఈదురుగాలులతో కూడిన వర్షాలతో భారీ హోర్డింగులు&comma; రేకుల షెడ్లు ఎగిరిపోగా&comma; చెట్లు నేలకొరిగాయి&period; రోడ్లపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి&period; అనేక ఇళ్లు ధ్వంసమవగా&comma; శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి&period; భదోహి జిల్లాలో ఓ వంతెన కూలి అనేక మంది గంగానదిలో పడిపోయారు&period; మీర్జాపూర్‌లో మరో వంతెన దెబ్బతిని దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period; ఉరుములు&comma; మెరుపులు&comma; ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు&comma; పిడుగుపాట్లకు తీవ్ర ప్రాణ&comma; ఆస్తి నష్టం వాటిల్లింది&period; పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా&comma; 72 మంది గాయపడ్డారు&period; 170 పశువులు మృత్యువాత పడ్డాయి&period; 227 ఇళ్లు దెబ్బతిన్నాయి&period; అత్యధికంగా ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో 24 మంది మృతి చెందగా&comma; భదోహీలో 18 మంది&comma; మీర్జాపూర్‌లో 15 మంది&comma; ఫతేపూర్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు&period; ఉన్నావ్‌&comma; బదాయూన్‌&comma; ప్రతాప్‌గఢ్‌&comma; బరేలీ&comma; సీతాపూర్‌&comma; రాయ్‌బరేలీ&comma; చందౌలీ జిల్లాల్లో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది&period;<&sol;p>&NewLine;<p>బరేలీ జిల్లాలోని బమియానా గ్రామంలో భారీ గాలులకు నన్హే మియా అనే ఆటో డ్రైవర్‌ రేకుల షెడ్డుతో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాడు&period; కొట్టుకుపోతున్న రేకుల షెడ్డును ఆపబోయి అతడు ఈ ప్రమాదానికి గురయ్యాడు&period; ఈ ఘటనలో చేతులు&comma; కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన నన్హే మియా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు&period; రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన ప్రాణ&comma; ఆస్తి నష్టాలపై అధికారులు వెంటనే స్పందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు&period; సహాయక చర్యలు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..