రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.

Advertisements

<p>కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు&period; తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని&comma; ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు&period; అయితే&comma; ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు&period; మండ్య జిల్లాలోని కే&period;ఆర్&period; పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు&period; రాజకీయాలు ప్రస్తుతం అత్యంత కలుషితమయ్యాయని&&num;8230&semi;&period; నిజాయతీతో కూడిన రాజకీయాలు మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు&period; ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు&period; 2028 నాటికి తన వయసు 82 ఏళ్లకు చేరుకుంటుందని&comma; అప్పుడు ఇప్పుడున్నంత ఉత్సాహంగా&comma; ఆరోగ్యంగా పనిచేయలేకపోవచ్చని పేర్కొన్నారు&period; ఈ ప్రకటనతో అక్కడున్న మద్దతుదారులు&comma; కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు&period; మరో పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని వారు సిద్ధరామయ్యను కోరారు&period; అయినప్పటికీ&comma; ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో&comma; సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని ఆదివారం &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; వేదికగా మరోసారి ధ్రువీకరించారు&period;<&sol;p>&NewLine;<p>సిద్ధరామయ్య రెండు పర్యాయాలుగా మొత్తం ఎనిమిదేళ్లకు పైగా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి&comma; రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం సీఎం పదవిలో ఉన్న నేతగా రికార్డు సృష్టించారు&period; 2013 నుంచి 2018 వరకు పూర్తి ఐదేళ్ల పాటు&comma; ఆ తర్వాత 2023 నుంచి 2026 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు&period; ఆయన గతంలో 2013&comma; 2018&comma; 2024 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ&comma; తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.