జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన

Advertisements

<p>దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది&period; ప్రశ్నపత్రం లీకేజీ&comma; అవకతవకల ఆరోపణలతో రద్దైన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది&period; జూన్ 21&comma; ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా వెల్లడించింది&period; ఈ మేరకు ఎన్‌టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది&period; పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం&comma; అడ్మిట్ కార్డులు&comma; పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి&period; మే 3à°¨ నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు&comma; తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు&period; పలుచోట్ల నిరసనలు వ్యక్తమవ్వగా&comma; కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి&period; ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం&comma; పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది&period; సుదీర్ఘ చర్చల అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం&period; కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్‌టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; రీ-ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని&period;&period;ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..