దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.

Advertisements

<p>దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు మంగళవారం పెంచాయి&period; వివిధ నగరాల్లో స్వల్ప తేడాతో వీటి ధరలు పెంచాయి&period; హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ à°§à°° పదకొండు రూపాయలు పెరిగి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలకు చేరుకుంది&period; ఇక ఏపీలో కూడా పదకొండు రూపాయలు పెరిగి రెండు వేల తొమ్మిది వందల ముప్పయి రెండు రూపాయలకు చేరింది&period; ఢిల్లీలో తొమ్మిది రూపాయల యాభై పైసలు పెరిగి రెండు వేల ఏడువందల నలభై ఏడు రూపాయలకు చేరింది&period; ముంబైలో రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలకు చేరింది&period; చెన్నైలో కూడా రెండు వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నుంచి రెండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలకు చేరింది&period; అంటే అక్కడ ఒక్క సిలిండర్‌పై పది రూపాయల యాభై పైసల అదనపు భారం పడింది&period; ఇతర నగరాల్లోనూ ధరల్లో మార్పులు నమోదయ్యాయి&period; గురుగ్రామ్‌లో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ à°§à°° రెండు వేల ఏడువందల అరవై నాలుగు రూపాయలకు చేరింది&period; నోయిడాలో రెండు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలకు పైగా పెరిగింది&period; లక్నోలో ఇదే à°§à°° కొనసాగుతోంది&period; పాట్నాలో మూడు వేల నలభై నాలుగు రూపాయలకు చేరింది&period; ఆయా ప్రాంతాల్లో 14&period;2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

శవాల దిబ్బగా నేపాల్.

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.