బాలిక హత్యోదంతంపై తమిళనాడు సీఎం సీరియస్..

బాలిక హత్యోదంతంపై తమిళనాడు సీఎం సీరియస్

Advertisements

<p>తమిళనాడులో పదేళ్ల బాలికపై జరిగిన దారుణ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది&period; చిన్నారి హత్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా&period;&period; ఈ ఘటనపై తమిళనాడు సీఎం Vijay తీవ్రంగా స్పందించారు&period; ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న సీఎం విజయ్&period;&period; వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు&period; నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని&period;&period; కఠిన చర్యలు తీసుకుని వేగంగా అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు&period; అలాగే కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు&period; బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని&period;&period; వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు&period; చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది&period;ఈ దారుణ ఘటనపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు&comma; మహిళా సంఘాలు&comma; బాలల హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి&period; నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి&period; సోషల్ మీడియాలో కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;ఇదిలా ఉంటే&period;&period; ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు&period; ఫోరెన్సిక్ ఆధారాలు&comma; సీసీటీవీ ఫుటేజ్&comma; అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు&period; ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు&period;చిన్నారి హత్య ఘటనతో తమిళనాడులో మహిళలు&comma; బాలికల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది&period; రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.