తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్

Advertisements

<p>పర్యావరణ హితమైన&comma; సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది&period; దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది&period; ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ హైడ్రోజన్ రైలును నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది&period; త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది&period; దీనికోసం 1&comma;200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు&period; ఈ టెక్నాలజీలో హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు&period; ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది&period; దీంతో సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం పూర్తిగా ఉండదు&period; ఈ చొరవతో హైడ్రోజన్ టెక్నాలజీని రైల్వే రంగంలో పరీక్షిస్తున్న జర్మనీ&comma; జపాన్&comma; చైనా&comma; అమెరికా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది&period; హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు&period; రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని నింపేందుకు జింద్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రీఫ్యూయలింగ్&comma; నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు&period; ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ&comma; పంపిణీ కోసం పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి అవసరమైన లైసెన్సు కూడా లభించింది&period;<&sol;p>&NewLine;<p>ప్రయాణికుల భద్రతకు రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది&period; జింద్‌లోని రీఫ్యూయలింగ్ కేంద్రంలో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు&comma; ఫ్లేమ్ డిటెక్టర్లతో సహా పలు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు&period; రైలు నిర్వహణ కోసం షకుర్‌బస్తీలో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కూడా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నారు&period; ఆర్‌డీఎస్‌వో ఆమోదించిన నిబంధనల ప్రకారం రైలు నిర్వహణ జరుగుతుందని&comma; శిక్షణ పొందిన సిబ్బంది 24 గంటల పర్యవేక్షణలో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; ప్రారంభ దశలో రైలుతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ప్రయాణించి&comma; పనితీరును పర్యవేక్షిస్తారు&period; ఆవిష్కరణలు&comma; ఇంధన సామర్థ్యం&comma; పర్యావరణ హిత రవాణా పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నామని భారత రైల్వే తెలిపింది&period; దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి&comma; నెట్-జీరో లక్ష్యాలను చేరుకునేందుకు ఈ హైడ్రోజన్ రైలు ఎంతగానో దోహదపడుతుందని రైల్వేశాఖ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.