టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం.

టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం

Advertisements

<p>బెంగాల్ TMCలో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది&period; అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి సెగలు ఇప్పుడు ఢిల్లీకి పాకాయి&period; తాజాగా ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి&comma; పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు&period; ఈ వారంలోనే టీఎంసీ నుంచి వైదొలగిన రెండో రాజ్యసభ సభ్యురాలు ఈమె&period;రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపిన తన రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని సుస్మితా దేవ్ కోరారు&period; రాజీనామా చేసిన కొద్దిసేపటికే&comma; ఆమె ఢిల్లీలో అసోం ముఖ్యమంత్రి&comma; బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మను కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి&period; ఐతే &&num;8220&semi;ఇది కేవలం అసోం కనెక్షన్ మాత్రమే&&num;8221&semi; అంటూ ఆమె సమాధానం దాటవేశారు&period; దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది&period; కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సుస్మితా దేవ్&comma; 2021లో టీఎంసీలో చేరారు&period; ఈమె అసోంకు చెందిన కాంగ్రెస్ దిగ్గజం సంత్ మోహన్ దేవ్ కుమార్తె&period; గతంలో కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా&comma; సిల్చార్ నుంచి ఎంపీగా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇదే వారంలో మరో టీఎంసీ సీనియర్ నేత&comma; రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి&comma; ఎంపీ పదవికి రాజీనామా చేశారు&period; బెంగాల్‌లో పార్టీ ఓటమిని&comma; ప్రజాతీర్పును గౌరవిస్తూ తాను వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది&period; ఈ వరుస రాజీనామాలు&comma; బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి&period; కొద్ది రోజుల క్రితమే&comma; 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి&comma; ప్రతిపక్ష నేత పదవికి అధికారిక అభ్యర్థిని కాదని వేరే వ్యక్తికి మద్దతు పలికారు&period; స్పీకర్ కూడా వారి నిర్ణయాన్నే à°®‌ద్దతు తెల‌à°ª‌డంతో పార్టీలో విభేదాలు బయటికొచ్చాయి&period; ఇప్పుడు ఈ అసమ్మతి సెగ జాతీయ స్థాయికి పాకడంతో టీఎంసీ అధిష్టానం తీవ్ర ఆందోళనలో పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.