కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్తునిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లుతోంది. అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయచర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి