ఆంద్రా-ఛత్తీస్‌ఘడ్(Andhra-Chhattisgarh) సరిహద్దు..
ఆంద్రా-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు(Maoist) మరొక్కసారి భీభత్సం సృష్టించారు. ఇనుపఖనిజం లోడుతో ఉన్న నాలుగు వాహానాలను ఆదివారం తెల్లవారజామున తగులబెట్టారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సరిహద్దుల్లో నారాయణ్‌పూర్ జిల్ఆ చోటేడొంగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓర్చ రహదారిపై ఇనుప ఖనిజం నింపిన నాలుగు ట్రక్కులను మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలు సమయంలో తగులబెట్టారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముందుగా సాయుదులైన 12 మంది మావోయిస్టులు ట్రక్కులు వద్దకు వచ్చి ట్రక్కులు ఉన్నవారిని బయటకు పిలిపించి వాహనాల డీజిట్ ట్యాంకు బద్దలుగొట్టి వాహనాలను తగులబెట్టారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు సమీపంలో జరగడం విశేషం. మొదటి నుంచి ఇనుపఖనిజం రవాణాను వ్యతిరేఖిస్తున్న మావోయిస్టులు ఎన్నికలు ముందు వాహనాలు తగులబెట్టడం సంచలనంగా మారింది.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి