తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ TVK అధినేత, నటుడు విజయ్ ఒక భావోద్వేగ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కుమారుడిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, రాజకీయాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తానని చాటిచెప్పారు. విజయ్ తన పాత డ్రైవర్ కుమారుడైన రాజశేఖర్‌ను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఖరారు చేశారు. అభ్యర్థిగా తన పేరు ప్రకటించగానే రాజశేఖర్ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి సాధారణ డ్రైవర్‌గా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన తనకు, ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏడుస్తున్న రాజశేఖర్‌ను చూసి చలించిపోయిన విజయ్, స్వయంగా తన చేతులతో ఆయన కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. ఈ దృశ్యం పార్టీ కార్యకర్తలను మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
National
బెంగాల్‌కు నష్టం చేసే ప్రయత్నాలు చేస్తే బీజేపీ జాతీయస్థాయిలో దెబ్బతింటుందని అన్నారు సీఎం మమతా బెనర్జీ. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారు బుల్డోజర్లను ఉపయోగించి అందరినీ బయటకు గెంటివేస్తారని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితా నుంచి కొన్ని పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మనం వాడుతున్న ఇంటర్నెట్ అంతా ఆకాశం నుంచి శాటిలైట్ల ద్వారా వస్తుందని అనుకుంటే పొరపాటే! సముద్ర గర్భంలో వేల కిలోమీటర్ల మేర పరచి ఉన్న కేబుళ్లే మన డిజిటల్ ప్రపంచానికి ఆధారం. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఈ కేబుళ్లను చిన్నాభిన్నం చేసేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే మన ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. దీనిపై ప్రత్యేక కథనం..
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. కానీ ఆ ప్రపంచాన్ని మనకు చూపిస్తోంది సముద్ర గర్భంలో ఉన్న సబ్‌సీ కేబుళ్లు. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 95 శాతానికి పైగా ఈ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్, హూతీ రెబల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ కేబుళ్లు ఉన్నాయి. యుద్ధం ముదిరితే ఇవి టార్గెట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క కేబుల్ తెగినా.. సోషల్ మీడియా నుంచి ఏఐ సర్వీసుల వరకు అన్నీ స్తంభించిపోతాయి. భారత్ నుంచి అమెరికా, యూరప్‌కు వెళ్లే డేటాలో మూడింట ఒక వంతు ఎర్ర సముద్రం మీదుగానే వెళ్తుంది. ముఖ్యంగా ‘బాబ్ అల్ మందేబ్’, ‘హర్ముజ్’ జలసంధులు ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఈ ప్రాంతంలోనే మెజారిటీ కేబుళ్లు ఉన్నాయి. ఇప్పటికే టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ కేబుళ్లు ప్రభావితమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కేబుల్స్ దెబ్బతింటే బాగు చేసే ‘రిపేర్ షిప్స్’ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) టెలికాం కంపెనీలతో అత్యవసర భేటీ నిర్వహించింది. ఒకవేళ పశ్చిమాసియా మార్గం మూసుకుపోతే, డేటాను సింగపూర్ మీదుగా మళ్లించాలని యోచిస్తున్నారు. అయితే, ఇది సుదీర్ఘమైన మార్గం కావడం వల్ల ఇంటర్నెట్ వేగం భారీగా తగ్గే అవకాశం ఉంది. వీడియో కాల్స్‌లో జాప్యం, ఆన్లైన్ గేమింగ్‌లో సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ కేబుళ్లే జీవననాడి. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, ఐటీ కంపెనీల కార్యకలాపాలు, ఈ-కామర్స్ అన్నీ ఈ డేటా లింక్స్పైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఫిజికల్‌గా కేబుళ్లు తెగిపోతే గ్లోబల్ పేమెంట్స్ నిలిచిపోతాయి. డిజిటల్ లావాదేవీల మీద పూర్తిగా ఆధారపడిన భారత్ వంటి దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది. అందుకే ఈ కేబుళ్ల భద్రతను దేశ భద్రతగా పరిగణిస్తోంది ప్రభుత్వం.
జియో, ఎయిర్టెల్ నిర్మిస్తున్న కొత్త కేబుళ్లు కూడా ఇదే ప్రమాదకర మార్గంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం కారణంగా ఇంటర్నెట్ సేవలు మందగిస్తే, దానిని తట్టుకోవడానికి పటిష్టమైన ప్రణాళికలు అవసరమని టెక్ నిపుణులు చెబుతున్నారు. భౌతిక దాడుల నుంచి కేబుళ్లను రక్షించుకోవడానికి ఇరాన్ వంటి దేశాలతో భారత్ దౌత్యపరమైన చర్చలు జరపాలని టెలికాం ఆపరేటర్లు కోరుతున్నారు. యుద్ధ మేఘాల మధ్య మన డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుందో వేచి చూడాలి.
దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. నోయిడాలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఢిల్లీ రద్దీకి పరిష్కారంగా ఈ కొత్త ఎయిర్పోర్ట్ పెద్ద ఊరటగా నిలవనుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది.ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, ముఖ్యంగా పీక్ టైమ్లలో ఈ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది.దీంతో మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవసరం చాలాకాలంగా వ్యక్తమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవర్ ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.అనంతరం ఆయన టెర్మినల్‌ను కూడా పరిశీలించనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గనుంది.
అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా ??
అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి వస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలనను ప్రజలకు దగ్గర చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలకు మెరుగైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశాలు విస్తరిస్తాయి.
ప్రత్యేకంగా యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త నాయకత్వానికి దారి తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది. నాయకుల బాధ్యత కూడా పెరిగే అవకాశముంది.
పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు ప్రభుత్వ ఖర్చును పెంచుతాయి. నాయకుల సంఖ్య పెరిగినా ప్రభుత్వ ఆదాయం అంతగా పెరగదు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది. నాయకుల సంఖ్య పెరగడం కంటే వారి నాణ్యత కూడా ముఖ్యమే. సంఖ్య పెరిగితే పరిపక్వత తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ఉంటే నిర్ణయాలలో గందరగోళం పెరగవచ్చని కూడా అంటున్నారు. సభలను విస్తరించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేల పెన్షన్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు.
ప్రస్తుతం నియోజకవర్గాలకు సరిపడా నిధులు అందడం లేదు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు కనీసం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వనరులు సరిపోతాయా అన్నది కీలక ప్రశ్నగా మారింది. మొత్తంగా చూసుకుంటే సీట్లు పెరగడం ఒక పరంగా మంచిదే అయినా, అది అతిగా పెరిగితే లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇటీవల ప్రధాని మోదీ.. పార్లమెంట్ ఉభయసభల్లో ఇరాన్ వార్ తో ఇబ్బందులు తప్పవని, సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. అయితే ఈ సూచనను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించాల్సి వచ్చింది. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. రాజ్యసభలో 2026 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి ఆధార రహితమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కోవిడ్ తరహా పరిస్థితులు మళ్లీ రావని, ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ భారత్‌లో లేదని..పాకిస్తాన్లో జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ, దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత, నిత్యావసరాల సరఫరా, రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో… చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘర్షణ ప్రభావం భారత్ ఇంధన దిగుమతులు, ఎరువుల సరఫరా, ఇతర వాణిజ్య కార్యకలాపాలపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ సమీక్ష చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడటం, సరఫరా గొలుసును పటిష్ఠపరచడం, నల్లబజారు, కృత్రిమ కొరతను నివారించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలులో ఉన్నందున తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకాలేదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటేరియట్ విడిగా సమావేశమవుతుందని కేంద్రం తెలిపింది.
అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి వస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలనను ప్రజలకు దగ్గర చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలకు మెరుగైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశాలు విస్తరిస్తాయి.
ప్రత్యేకంగా యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త నాయకత్వానికి దారి తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది. నాయకుల బాధ్యత కూడా పెరిగే అవకాశముంది.
పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు ప్రభుత్వ ఖర్చును పెంచుతాయి. నాయకుల సంఖ్య పెరిగినా ప్రభుత్వ ఆదాయం అంతగా పెరగదు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది. నాయకుల సంఖ్య పెరగడం కంటే వారి నాణ్యత కూడా ముఖ్యమే. సంఖ్య పెరిగితే పరిపక్వత తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ఉంటే నిర్ణయాలలో గందరగోళం పెరగవచ్చని కూడా అంటున్నారు. సభలను విస్తరించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేల పెన్షన్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు.
ప్రస్తుతం నియోజకవర్గాలకు సరిపడా నిధులు అందడం లేదు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు కనీసం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వనరులు సరిపోతాయా అన్నది కీలక ప్రశ్నగా మారింది. మొత్తంగా చూసుకుంటే సీట్లు పెరగడం ఒక పరంగా మంచిదే అయినా, అది అతిగా పెరిగితే లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
అగ్నివీర్లకు వివిధ విభాగాల్లో 20 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ మేరకు లేఖను ముఖ్యమంత్రులకు పంపినట్లు రిటైర్డ్ సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ తెలిపారు. 2027లో తమ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకునే వారికి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి కల్పించాలని హోం మంత్రి లేఖలో సూచించారు. త్రివిధ దళాల్లో పనిచేసిన వారికిచ్చే తరహాలోనే అగ్నివీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వాలని, ప్రధానంగా ఫారెస్ట్ గార్డులు, పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్లు, ఫైర్‌మెంట్, ఎస్డీఆర్ఎఫ్, మైనింగ్ గార్డులుగా, ప్రత్యేక పోలీసు అధికారులుగా రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే కొన్ని రాష్టాలు, సంస్థలు అగ్నివీర్లకు రిజర్వేషన్ కేటాస్తామని వెల్లడించాయి. ఇందులో హర్యానా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా జైలు వార్డెన్, పోలీస్ సహా ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పోలీసు, ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు రిజర్వేషన్లను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా ఎల్పీజీ గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం పోర్టుకు భారీ స్థాయిలో ఎల్పీజీ మరియు ముడి చమురును మోసుకొస్తూ రెండు భారీ నౌకలు చేరుకున్నాయి. యూఏఈ నుంచి ఈ నెల 20న బయలుదేరిన ఈ నౌకలు, తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్ వద్దకు చేరుకుని లంగరేశాయి. ఈ రాకతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత తీరుతుందని, ముఖ్యంగా గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.