బీజేపీ భయపడుతోంది.. అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహస్యం చేసింది ఎవరు.? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు అని రాజ్యాంగం చెబుతోందని, ఆ ఓటు హక్కుతోనే వాళ్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, కానీ మహారాష్ట్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతుల పంటలకు ధర లభించడం లేదని, యు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి