పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు నిఘా వర్గాలనుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్ నివాసం దగ్గర అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా నిఘా పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఈ క్రమంలో రాహుల్ పై పలు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. రాహుల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో రాహుల్ ఇంటి వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాదు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసులను మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ను కూడా పెంచారు. హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాదు. భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాలని. రాహుల్ గాంధీ నివాసం దగ్గర , ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి