పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు నిఘా వర్గాలనుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్ నివాసం దగ్గర అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా నిఘా పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఈ క్రమంలో రాహుల్ పై పలు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. రాహుల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో రాహుల్ ఇంటి వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాదు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసులను మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ను కూడా పెంచారు. హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాదు. భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాలని. రాహుల్ గాంధీ నివాసం దగ్గర , ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
- సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో గురువారం ‘సెమీకాన్ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
- జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
- 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.96 సంవత్సరాల తర్వాత బౌండరీస్ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
- లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.బ్రిటన్ రాజధాని లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్ మిషన్ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


