సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన నరేంద్ర మోదీ:
సికింద్రాబాద్-విశాఖపట్నం(Secunderabad – Visakhapatnam) మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్(Telangana-Andhra Pradesh) రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందే భారత్ రైలు నడవదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు వైజాగ్-సికింద్రాబాద్(Vizag-Secunderabad) వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల బుకింగ్స్ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ వందే భారత్ రైలు(Vande Bharat train) వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏడు ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్బిగ్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అన్ని బోగీలలో కలిపి మొత్తం 530 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి