Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…

ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…

by Prakash
Election Commission Commissioner Arun Goyal resigns

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే పదవి నుండి తప్పుకొవడం చర్చనీయాంశం. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తాజా రాజీనామా అనంతరం, ఇప్పటికే ఓ వెకెన్సీ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

013923
Total views : 78439

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.