Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home International పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…

by Prakash
Suicide attack in Pakistan

పాకిస్థాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పెషావర్‌లోని నాసిర్‌బాగ్‌ రోడ్‌లోని బోర్డు బజార్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి మోటార్‌ సైకిల్‌లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడులో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, గాయపడిన వారిని ఖైబర్‌ టీచింగ్‌ ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. గత నెలలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరిగాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: