Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh టెట్, డీఎస్సీ మధ్య గడువు పెంపు…

టెట్, డీఎస్సీ మధ్య గడువు పెంపు…

by Prakash
Andhra Pradesh Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) :

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, డీఎస్సీ మధ్య గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీఆర్టీ, డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ వెల్లడించారు. టెట్, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే నిర్వహించడం వల్ల ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఉండడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రెండు పరీక్షల మధ్య తగిన గడువు ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా టెట్, డీఎస్సీ షెడ్యూల్ మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా ఎస్జీటీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

040027
Total views : 203036

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: