మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి. మరి ఇంతకు ప్రజల తీర్పు ఎవరిని విజయతీరాలకు చేర్చుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
మహారాష్ట్ర సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమిదే విజయం అని తేలింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనాకొచ్చాయి.ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ కూడా గెలుపు తమదవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. హర్యానా, జమ్ము ఎగ్జిట్ పోల్స్ తారుమారవ్వడంతో.. మహావికాస్ అఘాడీ గెలుపు ధీమాలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయుతి గెలిస్తే.. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారని అంటున్నారు. ఎన్సీపీనే సీఎం ఎన్నికలో కింగ్ మేకర్ అవుతుందంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి