కాంగ్రెస్ పార్టీ(Congress party):
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ(Congress party) 46 మందితో కూడిన నాలుగో జాబితా(Fourth list)ను శనివారం రాత్రి విడుదల చేసింది. ఇందులో అసోం(Assam), అండమాన్ నికోబర్ దీవులు(Andaman and Nicobar Islands), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి ఒక్కో స్థానానికి అభ్యర్థిని ప్రకటించగా, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇద్దరికి సీట్లు కేటాయించింది. వీటితోపాటు మధ్యప్రదేశ్(12), మహారాష్ట్ర(4), మణిపూర్(2), మిజోరం(1), రాజస్థాన్(3), తమిళనాడు(7), ఉత్తర ప్రదేశ్(11), బెంగాల్(1) రాష్ట్రాల నుంచి పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను మరోసారి ప్రధాని మోడీపై పోటీకి దించింది. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ కాంగ్రెస్ ఇప్పటివరకు 185 అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించగా, 43 మందితో రెండో జాబితా, 57 మందితో మూడో జాబితా, తాజాగా 46 మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు నమోదు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి