112
కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నిందితున్ని మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందలూరుకు చెందిన పులి నవీన్ (38) కర్ణాటక నుంచి కర్ణాటక మద్యం తీసుకుని వస్తుండగా, మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో నిందితుడు మద్యంతో సహా పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితుని వద్ద రూ 20 వేల విలువ చేసే కర్ణాటక మధ్యం, కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. విచారణ అనంతరం అతనిపై అక్రమ మద్యం తరలింపు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.