63
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా ఆ మంటల్లో రిపేరుకు వచ్చిన వాహనాలు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మున్సిపాలిటీ ఆస్తులను సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బూడిద పాలు అవుతున్నాయని పట్టణంలోని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కార్యదర్శి, సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు