అత్యధిక రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరిగాయని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరిస్తే ప్రాణ నష్టాన్ని దూరం చేసుకోవచ్చన్నారు. జిల్లా వాసులంతా సంతోషంతో దీపావళి పండుగని జరుపుకో వాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే పదివేలు జరిమానా విధిస్తమని హెచ్చరించారు. రెండోసారి మళ్లీ పట్టుపడితే వారి లైసెన్సును ఖచ్చితంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు రంగం లోకి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి
70