ఈ రోజుల్లో ప్రజలు తమ సులభమైన పనుల కోసం ఈ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు అన్ని రకాల లావాదేవీలూ కరెన్సీ నోట్ల ద్వారా జరిగేవి. ఆ తర్వాత ATM కార్డులు వచ్చాయి. ఆ తర్వాత Paytm, Phonepe, Google Pay మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు స్మార్ట్ రింగ్ అదే తరహాలో వచ్చింది. కాబట్టి ఇకపై ATM కార్డ్, Paytm, Phonepe వంటివి అవసరం లేదు. వాటికి బదులుగా చేతికి ఉంగరం ఉంటే చాలు. మరి ఆ ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది తమ చేతికి ఉంగరం ధరిస్తారు. అయితే ఇప్పుడు అదే రింగ్ స్మార్ట్ టూల్‌గా మారింది. చేతిలో ఉంగరంతో నగదు రహిత చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ఇక నుంచి పొందవచ్చు. దీన్ని స్మార్ట్ రింగ్ అంటారు. ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు లేకుండా, Paytm లేదా ఫోన్ కాల్స్ అవసరం లేకుండా ఈ రింగ్‌తో చెల్లింపు చేయవచ్చు. స్మార్ట్ రింగ్‌ను హాంకాంగ్‌కు చెందిన టోపీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ రింగ్ ఫోన్ యాప్‌తో కలిసి పనిచేస్తుంది. వినియోగదారులు ఫోన్లోని సంబంధిత యాప్ నుంచి బ్యాంక్ ఖాతాలను రింగ్‌కి లింక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఈ రింగ్‌ని ఏదైనా దుకాణం, పేమెంట్ మెషీన్‌కి చూపడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ రింగ్ టెక్నాలజీని జువెలరీ కంపెనీలకు అందిస్తే వెండి, బంగారంతో కూడా స్మార్ట్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఇంకా రింగ్ ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. స్వదేశీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ 7 రింగ్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం స్మార్ట్ రింగ్‌ను ప్రారంభించింది. NPCI సహకారంతో ఇండియన్ బ్రాండ్ 7 అభివృద్ధి చేసింది. ఇది 7 వేర్వేరు పరిమాణాలలో అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో తయారైంది.
ఫోన్ తో పనిలేదు..స్మార్ట్ రింగ్ తో ఆన్లైన్ పేమెంట్స్
63
previous post