వన్ నేషన్….వన్ స్టూడెంట్ ఐడీ కార్డు

Apar Card

Advertisements

&NewLine;<p>భారత పౌరులు అందరికీ ఒకే గుర్తింపు ఆధార్ కార్డు తరహాలో దేశంలోని విద్యార్థులు అందరికీ ఒకే ఐడీ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది&period; ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ &lpar;ఆపార్ కార్డ్&rpar; ను మొదలుపెట్టింది&period; జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా విద్యార్థులకు ఈ కొత్త ఐడీని జారీ చేస్తోంది&period; వన్ నేషన్&comma; వన్ స్టూడెంట్ ఐడీ కార్డుగా దీనిని వ్యవహరిస్తారు&period; దీంతో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు అంటే&period;&period; డిగ్రీలు&comma; రివార్డులు&comma; స్కాలర్ షిప్ లు&comma; క్రెడిట్ లు సహా పూర్తి అకడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు&period; విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ వ్యవస్థను ఎడ్యు లాకర్ గా సూచిస్తున్నారు&period; ఆపార్ కార్డు&period;&period; దేశంలోని అన్ని ప్రైవేట్&comma; ప్రభుత్వ పాఠశాలలు&comma; కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించబోయే డిజిటల్ ఐడీ&period; అకడమిక్ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేయడం వల్ల ఆన్ లైన్ లో తమ వివరాలను అవసరమైనపుడు చూసుకోవడం&comma; డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యపడుతుంది&period; విద్యార్థులకు సంబంధించిన ట్రాక్ రికార్డును నమోదు చేయవచ్చు&period; దీంతో ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ సులభం కానుంది&period; ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థుల దాకా&period;&period; అన్ని పాఠశాలలు&comma; కళాశాలలు ఈ కార్డును జారీ చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్