75
లేత ఉల్లికాడలు గొప్ప రుచిని, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు, కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. ఉల్లికాడలు తీసుకోవడం వల్ల ఊబరం వంటి సమస్యలు తగ్గుతాయి. లివర్లో పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా ఉల్లికాడలు సహాయపడుతాయి. ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ గుండె పై ప్రభావం చూపకుండా సహాయపడుతాయి. ఈ విధంగా ఉల్లికాడలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.