84
బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దేశంలో వీదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగాయని బడ్జెట్‌లో ప్రసంగించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కార్తీ చిదంబరం విమర్శించారు. స్వీయ పొగడ్తలకే బడ్జెట్ పరిమితం అయిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది వీడ్కోలు బడ్జెట్ అని వారు ఎద్దేవా చేశారు.